Saturday, December 27, 2008

సినిమా ఏ క్లాసు?

సందేహం సందేహం ఎమిటో ఈ మద్య నాకు దౌబ్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటి సందెహం ఎమిటంటె అసలు మంచి సినిమా ఏ క్లాసు ఎందుకంటే క్లాసు సినిమా మాసు సినిమా అని విభజన జరిగింది కదా. ఇలా ఎందుకంటున్నాంటే నేను సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులతోను చూసాను. వాళ్ళ కామెంట్స్ విన్నాను ప్రతీ సినిమాని రేండు సార్లు రెజర్వెడ్ లోను నేల లోను చూసాను. చాలా సార్లు మంచి సినిమాలను గొదావరి, ఐతె ,ఆనంద్ లాంటి సినిమాలు కింది వర్గం(క్షమించండి ఇక్కడ నేల టిక్కెట్ తీసుకున్న వాళ్ళనని నా వుద్దేసం కాదు పై నుంచి కిందకు స్క్రీన్ కు దగ్గరగా వుంటారు కాబట్టి అందుకని) ఎక్కువమంది ఎంజాయ్ చెయ్యలేక పొయారు ఎందుకని? అవే సినిమాలను పై వర్గం బాగానే రిసీవ్ చెసుకున్నారే నాకు కూడా నచ్చాయి.నిజానికి అవి మంచి సినిమాలేనే మరి ఎందుకు ఈ తేడా. కుటుంబ, సాంఘిక(అంటె పెరిగిన వాతావరణం ) తో బాటు విద్య కూడా ప్రభావితం చేస్తున్నదన్నమాట. బాబొయ్ సినిమా తొ అందరనీ మెప్పించడం చాలా కష్తమండి. సొల్యూషన్ అలొచించాలి మరి.

Friday, December 26, 2008

సమీక్షలా (రివ్యూ)? చదివితే అంతే !

బాబొయ్ సమీక్షలు ! ఇదెంటి అనుకుంటున్నరా ఇప్పుడే జొస్యుల సుర్యప్రకాష్ గారు రాసిన "చూస్తె అంతే" (నేనింతె సినిమా గురుంచి లేండి) నవతరంగం లొ చదివాను.చదివిన తరువాత ఇప్పుడు తల పట్టుకుంటున్నాను అస్సలు ఎందుకు చదివానా అని. రివ్యూ ల మీద నా మొత్తం అభిప్రాయాలను మార్చివేసారు. అయన తన పైత్యమంతా రివ్యూ పేరుతో ప్రయొగించారు. బ్లాగ్ ముఖంగ నేను చెసే విన్నపం ఏమిటంటె దయ చేసి సినిమా విషయంలొ ఎవరి మాటా నమ్మకండి. ఆంధ్రులు పొస్టెర్ చూసి స్టోరి చెప్పెసే రకాలు. మీ తెలివితేటలు మీరే తక్కువ చేసుకొకండి. పొస్టెర్లు చూడండి, ట్రైలర్లు చూడండి నచ్చితే సినిమాకి వెళ్ళండి లేకపొతే లేదు
p.s మీకు కూడా ఆ తలనొప్పి ఎందుకని లింక్ ఇవ్వడం లేదు.

Thursday, December 25, 2008

ఏది ముందు బాబూ సినిమానా సమీక్షా?

గుడ్డు ముందా లేక కోడి ముందా అంటె చెప్పలేమేమొ కాని సమీక్ష ముందా సినిమా ముందా అంటే మాత్రం ఖచ్చితంగా చెబుతాను. సినిమా నే అని, ఎందుకంటే బాసూ చెప్పేవాళ్ళు వందమంది వుంటారు. మరి వినే వాళ్ళకి ఏమైంది. ఆ మాత్రం అలోచించే బుర్ర వాళ్ళకు లేదా. ఐనా మన భారతీయుల జాఢ్యమే ఇది బాసు. పక్క వాళ్ళు ఏమి చెప్పినా నమ్మేస్తాము.ఎందుకొ తెలేదు మన మీద మన కన్నా పక్కవళ్ళ మీద నమ్మకం ఎక్కువ. ఇదంతా ఎందుకంటే సినిమా సమీక్షలని నమ్మి నేను చాలా సార్లు మొసపొయాను. బాగుంది అని రాసింది బాగాలేవు బాగొలేదు అన్నవి కొన్ని బాగా నచ్చాయి. కనుక సమీక్షలు ఎప్పుడు సినిమా తరువాత చదవాలని తెలుసుకున్నాను. మీకు కూడ కొంచెం బుర్ర వుందని అనుకుంటున్నాను.

కెవ్వు కేక

నేను బ్లాగటం మొదలు పెట్టి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఇప్పటి దాకా తెలుగులో బ్లాగటం చెయ్యలేదు. (పి .స్ బ్లాగటం అంటె ఏమిటో అనుకునేరు బ్లాగ్ లను తెలుగు లొ రాయడం తెంగ్లిష్ కదండి.) ఈ మద్య తెలుగు లొ రాయడం మొదలుపెట్టి నెనేదొ ఉడబొడెచెస్తున్నానని అనుకున్నా కాని koodali.org లొ బ్లాగ్ లను చూసిన తరువాత అర్ధమయ్యింది. మనం చాలా వెనుకబడి వున్నామని ఐనా పరవలేదు ఇప్పటికైనా మొదలుపెట్టానని సంతొషంగావుంది.ఒకసారి koodali.org ని చూడండి యెంత చక్కగా చక్కిలిగింతలు పెడుతూ విషయాలను స్ట్రైట్ గా చెబుతున్నారో. ఇక నుంచి ఇంకా సీరియస్ గా బ్లాగ్ లను రయలని అనుకుంటున్నా. కాంపిటిషన్ చాలా హెవీ గురూ .

Wednesday, December 24, 2008

నేనింతే సినిమా గురుంచి కొంచెం

నేనింతే సినిమా ని ఇప్పుడే గంట క్రితం చూసాను. పూరి జగన్నాధ్ చాలా స్ట్రైట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని బేరీజు వేసుకుంటూ మంచిగా తీసాడు. ముఖ్యంగా ఆడియన్స్ కి కొన్ని మంచి మెస్సేజ్లు ఇచ్చాడు. ఇది చాలా అహ్వనించదగ్గ పరిణామం. ఇంటెర్నెట్ లోను పేపర్ల లోను వచ్చే రివ్యు ల గురించి బాగా చెప్పాడు.ఐనా ప్రతిఒక్కరు ఒకలాగ అలొచించరు కదా నాకు నచ్చేది మీకు నచ్చక పోవొచ్చు.మీకు నచ్చేది నాకు. మరి వీళ్ళు ఎలా డిసైడ్ చేసెస్తారొ నాకైతె అర్ధం కావడం లేదు. సినిమాలొ చాలా ఎలిమెంట్స్ తొ ప్రెక్షకులకు మంచిని చెప్పాడు. సారి ఇక్కడ పూరి ని గౌరవంగా సంబొదించడం కుదరడం లేదు (వారు, గారు అంటె మీకు అర్ధం కాదని నా ఫీలింగ్ ).నేను సినిమా కి వెళ్ళే ముందు ఒక ఫ్రెండ్ అంతగ నచ్చలేదని చెప్పాడు. మరి నాకెమొ బాగుందని అనిపించింది నాతొ వున్న ఫ్రెండ్ కి చల బాగా నచ్చింది మరి దీనిని ఎమంటరు. కనుక రివెవ్ లను అంతగా నమ్మకండి మరి..

Tuesday, December 23, 2008

స్వర్గీయ పి.వీ నరసింహారావు garu

స్వర్గీయ శ్రీ పి.వి నరశింహారావు గారు తెలుగు వారి కి ఒక అమూల్య మైన గుర్తింపుని తీసుకొని వచ్చారు. జవహర్లాల్ నెహ్రు, ఇందిరా గాంధి తరువాత ఎక్కువ కాలం భారత దేశాన్ని పాలించింది మన తెలుగువాడు కవదం మన గర్వకారణం. శ్రీ పి.వి గారు గొప్ప స్తితప్రగ్నత గల బహు బషాకొవిదిడు, అంతే కాకుండా దేశాన్ని అర్ధికంగా ముందుకు నడిపించిన గొప్ప ప్రగ్నాసలి. ఆయన వర్దంతి సందర్భంగా ఒకసారి ఆయనను మనసారా స్మృతి చేసుకుందాం.

Sunday, December 21, 2008

సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ మంచివా కాదా?

ఆవకాయబిరియాని సినిమా చూసిన తరువాత నాకు ఒక సందేహం వచ్చింది. అస్సలు తెలుగు ప్రేక్షకులకు నచ్చేది ఏమిటి అని? నాకు మటుకు సినిమా బాగా నచ్చింది.కాని సినిమా box office వద్ద బొల్తా కొట్టింది. ఎందుకని ఇప్పుడు అలొచిస్తుంటే అర్ధమవుతుంది. సినిమ ఫేయిల్యుర్ కి సక్సెస్ కి సినిమా లోని పాటలు, కధ,టేకింగ్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడ కారణాలు అవుతున్నాయి అని. ఉదాహరణకి నేను గుడుంబా శంకర్ చూడడానికి ముందు యెందుకనొ తెలియదు నాకు పవన్ కల్యాణ్ పెద్దగా నచ్చే వాడు కాదు. ఖుషి తరువాత వచ్చిన చాలా సినిమాలని నేను ఛూడకుండానే మిస్స్ చెసాను. గుడుంబా శంకర్ with out ఎక్స్పెక్టేషన్ వెళ్లాను. సినిమా మొత్తం పవన్ కల్యాన్ పెర్ఫార్మన్స్ బాగా నచ్చింది. కాని బాలు కి ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లాను అందుకేనేమొ సినిమాని అంతగా ఎంజాయ్ చెయ్యలేక పొయ్యాను.సినిమా బాగున్నా ఇంకా ఇంకా వుంటే బాగున్ను అని అనుకున్నాను. కనుక డైరక్టర్లు ఈ విషయాలను కూడా దృష్టిలొ పెట్టుకొవాలి మరి.

Friday, December 12, 2008

రాజకీయలకు నేను దూరం

సరే నా బ్లాగ్ లొ చర్చించే విషయాలలో రాజకీయాల ప్రసక్తి తీసుకొచ్చాను కదా.కాని నేను మట్లాడదానికి ఏమి లేదు ఎందుకంటే ఇప్పుడు వున్న పరిస్తితి ని చూస్తె చాలా అగమ్యగోచరంగ వుంది. వీటి గురించి చర్చించే వయసు కాని అనుభవం కాని నాకు లేవు మరి. కాని సమయం వస్తే తప్పకుండా నా అబిప్రాయలను మీతో పంచుకుంటాను. ఓకే నా మరి.

Wednesday, December 10, 2008

వాడుకలో లేని తెలుగు పదాలను వాడడం అవసరమా !

అసలు నా బ్లాగ్ ఎవరు చదవాలని నా ఉద్దేశం?
ఇంటెర్నెట్ వాడుతున్న వారిలొ ఎక్కువ మంది యువత (యువత అనే కంటే యూథ్ youth) అంటే బాగా అర్ధం అవుతుందేమొ. తెలుగు అంటే నాకు అపారమైన ప్రేమ వుంది కాని ఎక్కువ మందికి అర్ధం అయ్యేటట్లు రాయాలి కద. ఆక్షేపన కన్నా అభ్యంత్రం అర్ధం అవుతుంది. బస్సును చతుష్చక్ర వాహనం అంటే ఎవరికి అర్ధం అవుతుంది.సులువు కన్నా ఈఙీ అర్ధం అవ్వడం easy కదా. తెలుగు ఎప్పుడో ఇంగ్లిష్ తొ మిక్స్ అయ్యి తెంగ్లిష్ అయ్యింది .when you are in Rome be a Roman అన్నారు కదా. ప్రధానంగా మంచి తెలుగు సాహిత్యం youth ని base చేసుకొని ఎక్కద వస్తుంది. రాసె వాల్లందరు Aged పీపుల్ ఆయె. జెనరేషన్ గాప్ కూడ సహిత్యం లొ యెక్కువ కనిపిస్తుంది. ఈ మాత్రం తెలుగునైనా బ్రతికిద్దాం అని బ్లాగ్గింగ్ తెంగ్లిష్ వాడుదాం అని అనుకుంటున్నాను . p.s. (ఆక్రమన ఎప్పుదు నెమ్మదిగా విస్తరిస్తునే చెయ్యాలి. ఒకే సారి చేస్తే ప్రతిఘటన(revolution) ఎదురవుతుంది ) తెలుగును బ్రతికిద్దామా మరి.

Tuesday, December 9, 2008

సీరియస్ బ్లాగింగ్

ఓకె ఈ రోజు బ్లాగింగ్ గురుంచి మాట్లాడుకుందాం. కఛితంగా నా బ్లాగ్ ని అందరు చదవాలంటే యేమి చెయ్యాలొ అలోచించాను . అప్పుడు తట్టింది ఆంధ్రులు ఎక్కువుగా చర్చించుకునేవి మూడే విషయాలు
1.సినిమా
2.రాజకీయలు
3.గొడవలు (క్రైమె న్యూస్)
వీటి మీద అధరపడే కద న్యూస్ చానెల్స్ అన్ని బతికేస్తున్నాయి.

Monday, December 8, 2008

రాజకీయాల వేడి

రాజకీయ వేడి బాగా రాజుకుంటున్న ఈ టైం లొ ఈ బ్లాగ్ యేమిటి రా మహానుభావా అని అనుకుంటున్నారా అయినా పర్వాలేదు అని అంటారా నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు కఛితంగా చెప్పవలసింది లేఖిని గురించి ఇంత మంచిగ సాఫ్టవేర్ తయారు చెసినదుకు కౄతఘ్నతలు.

నా మొదటి పోస్టింగ్

హలొ నేను జగదీష్ రెడ్డి. ఇది నా మొదటి బ్లాగ్. చాలా కష్టపడి టైప్ చేసా. ఇప్పుదు చెప్పల్సింది యేమిటంటే నేను చెప్పనంతే.