Sunday, April 26, 2009

సాఫ్ట్‌వేర్ కార్మికులు

ఒక సారి హైదరాబాద్ సైబర్ సిటి ఎదురుగా ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల మద్య నిలుచొని చూడండి. ఒకసారిగ ప్రపంచం చాల వేగవంతమైనట్టుగా కనిపిస్తుంది. అప్పటిదాకా ప్రశాంతంగా కనిపించిన రోడ్డ్లు ఒక్కసారిగా గజిబిజిగా మారిపొతాయి. ఎటు చూసిన కార్లు మొటారు సైకిళ్ళతో బిజీగా మారిపొతుంది. లేత వర్ణపు దుస్తులతో జనం చీమల్లాగా రొడ్డు దాటుతు కనిపిస్తారు.(టిఫ్ఫిన్ బాక్స్లు భుజానికి వెళ్ళాడి వుంటాయి.) వీళ్ళని చూస్తుంటే ఖాఖీ డ్రెస్సలు దరించిన కార్మికులు గుర్తుకు వస్తారు. తేడ ఎంటంటే వీళ్ళు మరీ యూనిఫార్మ్ లాగ కాకుండా కొంచెం వైవిద్యం చూపిస్తారు (డెస్సలలో). కాని వీరు కూడ గంట కొట్టిన తరువాత బైటపడే స్కూల్ పిల్లల లాగా ఒకేసారి 5.00గంటలకు బైటకు వస్తారు.(సాయంత్రం వేళ గుహ లొంచి బైట పడే గబ్బిలాల్లతొ పొల్చడం కొంచెం కష్టమనుకొండి ). ఇంక చూసుకొండి ఆటొల దగ్గ్గర రైల్వే స్టేషన్ లొను వీళ్ళ పోట్లాటలు, ఇబ్బందులు. సాఫ్ట్‌వేర్ కధలు అని శీర్షిక పెట్టి ఇంకొ బ్లాగ్ పెట్టొచ్చేమొ. కాని వీళ్ళను చూస్తుంటే జాలి కలగడం మాతరం తప్పదు ఎన్నొ ప్రదెశాల నుండి రాష్ట్రాల నుండి వలస వచ్చిన వీరిని చూస్తే భరతదేశం లొ వున్న బిన్నత్వంతొ పాటు ఏకత్వం కూడా కనిపిస్తుంది.కాని ఇప్పుడు మాత్రం వీరి మొఖంలో ఇంతకు ముందు కంపించినటువంటి చలాకిదనం మాత్రం కనిపించడం లేదు.కారణం ఎమిటొ వారికే తెలియాలి(అందరికి తెలుసనుకొండి).మళ్ళి వారి మోములు చిరునవ్వులు అలంకరించాలని కొరుకుంటూ సెలవు తీసుకుంటున్నా !
p.sతల్లితండ్రులకు విగ్నప్తి ప్రపంచం లొ ఇంజెనీరింగ్ మరియు మెడిసిన్ మాత్రమే విద్యలు కావు. ప్రతీ రంగం లొను ఎప్పుడు మొదటి స్థానం వుంటుంది. మీ పిల్లలను వారి వారి అభిరుచుల మేరకు ప్రొత్షహించండి. కాని మీ ఆశలను వారి మీద రుద్దకండి. ఇప్పటికే మన విద్య వ్యవస్థ వలన బాల్యాలు పుస్తకల బరువుల కింద చిద్రమవుతున్నయి ఇంకా వారిని హింసపెట్టడం మనకు తగునా! అలొచించండి మరి (వారిని అన్ని రంగాలలొను గెలిచె వారిగా తీర్చుదిద్దుదాము )
"విద్య కు అర్ధం ప్రపంచ ఙ్నానం."
మేలుకొండి మరి !

Tuesday, April 21, 2009

రైతులు కావలెను ?

ఎంటిది అనుకొంటున్నారా? నిజమండి ! వ్యవసాయ ప్రధానమైన మన దేశంలొ రైతుల కొరత రాబొతుంది. మన దేశం లొ విద్యా విధానాలు, ప్రభుత్వాలు,తల్లి తండ్రులు అఖరికి రైతులు చూపిస్తున్న శ్రధ్ధ వలన రైతుల కొరత రాబొతుంది. విషయం లొకి సూటిగా వస్తున్నాను. మన దేశం లొ వ్యవసాయం ఒక నేరం! నష్తాలతొ నిండుకున్న వ్యవహరం. కారణం అనాదిగా పాటిస్తున్న సేద్యపు పద్దతులనే ఇప్పటికి మనం పాటిస్తున్నాము. ఎవరిని అడిగినా ఇంజినీర్లో డాక్టర్లో అవుతానంటున్నారు కానీ ఒక రైతు కావాలని ఎవరు అనుకొవడం లేదు. అఖరికి రైతులు కూడ తమ వారిని రైతులగా చూడాలని అనుకొవడం లేదు. మార్పు నిజంగా మన మంత్రం అవ్వాలంటే సేద్యాన్ని కూడా ఒక మాద్యమంగా స్వీకరించాలి. ఎక్కువ మంది విద్యవంతులు వ్యవసాయాన్ని ఉపాదిగా స్వీకరించాలి. యెడారి దేశమైన ఇస్రాయిల్ ఈ విషయంలో ఎంతో ముందుంది. ఇప్పటికైన మేలుకుందాం! బూంలను పట్టుకొని వెళ్ళాడక భూములను నమ్ముకుందాం. జై కిసాన్ జై హింద్.