Tuesday, February 10, 2009

హెయిర్ ఈజ్ ఫెయిర్

ఇది ఒక జుట్టు బాధ కధ. ఏంటిది అనుకుంటున్నారా. ఏమీ లేదండి ఈ మద్య మా ఫ్రేండ్స్ కి జుట్టు మీద ప్రేమ ఎక్కువ అయ్యిపొయింది. ఎందుకో అర్ధం కావడం లేదు. పట్టుమని మాకు పాతిక ఏళ్ళు వుండవు. కాని ఈ మద్య అందరం కలిస్తే మాత్రం టాపిక్ రాలిపొతున్న జుట్టు గురించే. మేము టీనేజ్ లోకి రాక ముందు క్రికెట్ గురుంచి మాట్లాడుకునే వాళ్ళం. ఇంటర్ డిగ్రీలొ అమ్మాయిల గురుంచి వుండేది. తరువాత చేతిలోను నొటిలోను సెల్ల్ టాపిక్కే.ఇప్పుడు మాత్రం జుట్టే హాట్ టాపిక్. ఇప్పుడిప్పుడే ఒకొక్కరు సాఫ్ట్ వేరు లోనొ చెట్టు లోనొ స్ఠిరపడుతున్నారు కాని పావు పావు ఎకరాల జుట్టు మాత్రం రాలగొట్టుకుంటున్నారు. మా వూరు నుంచి ఈమద్య ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఒక ఆయన మకాం మార్చేసారు. ఆయనను కలవడానికి నా ఫ్రెండ్ ఒకడు బెంగుళూరు నుండి హైదరాబాదు వచ్చాడు. తీర అతి కష్టం మీద అప్పాయింట్మెంటు తీసుకుంటే సదరు డాక్టరు గారు ఒక యాభై మంది బట్ట తల సాఫ్త్వేర్ నిపుణులను కలిపి క్లాస్ తీసుకుంటున్నరంటా వాల్లంత హేర్ ట్రాన్స్ ప్లాంట్ కొసం వచ్చారంటా. అంతా 25 నిండి 35 లోపు వారేనంటా. కాబట్టి జుట్టు ఇంకా వూడని వాళ్ళు మాత్రం ఇప్పటి నుండే ప్రత్యామ్యాలు చూసుకొవాలి