Monday, January 26, 2009

స్లం డాగ్ మిలీనియర్

ఏంటొ ఈ మద్య సినిమాలకు విమర్శలు మాత్రం ఎక్కువ అయిపొతున్నాయి . పాపం డాన్ని బొయ్లె చాలా కష్టపడి(ఇష్టపడి కూడా అయ్యివుంటుంది లేండి) సినిమా తీస్తే దాంట్లొ వున్న విషయాన్ని పక్కన పెట్టి అబ్బెబ్బె అసలు ఇండియా అంత దౌర్బాగ్య స్తితి లో లేదు అంతా అభూథ కల్పన అని కొట్టి పారేస్తున్నారు. నిజమే అంతా దారుణంగా ఐతే లేదు(కార్ల అద్దాలలో నుంచి చూసే వారికి లేండి) కాని నిజం చెప్పాలి ఇండియా లో ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతూనే వున్నారు. హైదరాబాద్ లొనే ఇప్పటికి రొజుకొక సారి నీళ్ళు రావడం లేదు. ఇంకా మురికి వాడల గురుంచి మారుమూళ్ళ పల్లెటూర్ల(తక్కువ జనాభా) గురుంచి యేమి మాట్లడతాము మొన్నా మద్య ఆవకయ బిరియాని లొ కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. ఐనా మనకెందుకండి మన ఇంట్లొ మాత్రం పుష్కలంగా నీళ్ళు వుంటే చాలు రొజుకు రెండు బకెట్లు స్నానంచెయ్యడానికి అంతే తప్పించి పక్క వాళ్ళ గురుంచి మనకెందుకంటారూ! అంతేనా!. మన విమర్శలకు సినిమాలు చాలు ప్రజా,సంఘ సమస్యలు ఎందుకు? ఎవరికి కావాలి?

Wednesday, January 7, 2009

ఇంగ్లీష్ సంవత్సరం

యహూ అనాలో వూహుం తెలియడం లేదు మొత్తానికి ఇంకొక కొత్త సంవత్సరం వచ్చేసింది. ఎమిటొ ఈ మద్య ఇంగ్లిష్ సంవత్సరం చేసుకుంటున్నంత బాగా తెలుగు సంవత్సరం(ఉగాది) చెసుకొవడం లేదు (celebrations లేండి). కారణం ఏమిటంటారు? మన పండగల మీద మనకే బోర్ కొట్టిందా. ఇది చెప్పడానికి కూడ కొంచం కష్టంగానె వుంది ? కాని ఇధి నిజం పొరిగింటి పుల్ల కూర రుచి అనే సంప్రదాయాన్ని మాత్రం మన భారతీయులు మరచిపోవడం లేదు. ఈ సారైన సాస్త్రొక్తంగా పండుగ చేసుకుందామా.