Tuesday, April 21, 2009

రైతులు కావలెను ?

ఎంటిది అనుకొంటున్నారా? నిజమండి ! వ్యవసాయ ప్రధానమైన మన దేశంలొ రైతుల కొరత రాబొతుంది. మన దేశం లొ విద్యా విధానాలు, ప్రభుత్వాలు,తల్లి తండ్రులు అఖరికి రైతులు చూపిస్తున్న శ్రధ్ధ వలన రైతుల కొరత రాబొతుంది. విషయం లొకి సూటిగా వస్తున్నాను. మన దేశం లొ వ్యవసాయం ఒక నేరం! నష్తాలతొ నిండుకున్న వ్యవహరం. కారణం అనాదిగా పాటిస్తున్న సేద్యపు పద్దతులనే ఇప్పటికి మనం పాటిస్తున్నాము. ఎవరిని అడిగినా ఇంజినీర్లో డాక్టర్లో అవుతానంటున్నారు కానీ ఒక రైతు కావాలని ఎవరు అనుకొవడం లేదు. అఖరికి రైతులు కూడ తమ వారిని రైతులగా చూడాలని అనుకొవడం లేదు. మార్పు నిజంగా మన మంత్రం అవ్వాలంటే సేద్యాన్ని కూడా ఒక మాద్యమంగా స్వీకరించాలి. ఎక్కువ మంది విద్యవంతులు వ్యవసాయాన్ని ఉపాదిగా స్వీకరించాలి. యెడారి దేశమైన ఇస్రాయిల్ ఈ విషయంలో ఎంతో ముందుంది. ఇప్పటికైన మేలుకుందాం! బూంలను పట్టుకొని వెళ్ళాడక భూములను నమ్ముకుందాం. జై కిసాన్ జై హింద్.

3 comments:

aswinisri said...

you are correct

Anonymous said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం. మేం రైతులమే. కష్టనష్టాలు అన్నిటిలోనూ వుంటాయి అలాగే వ్యవసాయంలోనూ వున్నాయి. గతం లో కంటే ఇప్పుడు రైతులమీద ప్రభుత్వాలకి ప్రేమ ( ఓట్ల కోసమైనా) పెరిగింది. కాబట్టి భవిషత్తు లో రైతులకు మంచి రోజులు వస్తాయని ఆసించవచ్చు.

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

అవును నిజం..!

లలిత గారూ.., రైతుల మీద ప్రభుత్వాలకి ప్రేమ ఇసుమంతైనా పెరగలేదండీ...! నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా.., దేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ౩౦ సం|| క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడూ అంతే..., అప్పుడే విధంగా వ్యవసాయం చేసారో ఇప్పుడూ అంతే... దాదాపు అప్పుడెంత దిగుబడో ఇప్పుడూ అంతే.., ప్రపంచం వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఎంత ముందుకు పోయినా.., ఆ టెక్నాలజీ మన రైతుల దగ్గరికి ఎందుకు చేరలేదు..? రైతుల రుణాలు మాఫీ చేసామని ముసలి కన్నీరు కారుస్తున్న ప్రభుత్వాలు.., రైతుల పంట దాచుకోవటానికి కావలసిన infrastructure (Cold storages & etc) అభివృద్ధి చేయటానికి ఎందుకు ప్రయత్నం చేయటంలేదు? ఆరుగాలం కష్టపడి పండించిన పంటను, మరో దారిలేక వచ్చినకాడికి తెగనమ్ముకునే పరిస్థితిని మార్చటానికి ప్రయత్నం చేయరెందుకు..? FCI, Marketing శాఖలు నిజంగా రైతులకు ఉపయోగపడటంలో విఫలమౌతున్నాయెందుకు? మన రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంలో విఫలమౌతున్నారెందుకు? ప్రభుత్వం ఆ విషయంలో శ్రద్ధ చూపదెందుకు? అసలు మనకి సరిపడినన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలున్నాయా? ఉన్నవి రైతులతో సంబంధం లేకుండా ఎందుకున్నాయి..?

ఇప్పుడు మనక్కావాల్సింది.., పైన చెప్పినట్లు
చదువుకున్నవాళ్ళు ఈ రంగంలోకి రావటంతో పాటు, ప్రభుత్వాలు కూడ దిశా నిర్దేశాలు కల్పించే స్థితి కి చేరాలి, మౌలిక వసతులు కల్పించే భాద్యత ప్రభుత్వాలు తీసుకోవాలి.