Sunday, December 21, 2008
సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ మంచివా కాదా?
ఆవకాయబిరియాని సినిమా చూసిన తరువాత నాకు ఒక సందేహం వచ్చింది. అస్సలు తెలుగు ప్రేక్షకులకు నచ్చేది ఏమిటి అని? నాకు మటుకు సినిమా బాగా నచ్చింది.కాని సినిమా box office వద్ద బొల్తా కొట్టింది. ఎందుకని ఇప్పుడు అలొచిస్తుంటే అర్ధమవుతుంది. సినిమ ఫేయిల్యుర్ కి సక్సెస్ కి సినిమా లోని పాటలు, కధ,టేకింగ్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడ కారణాలు అవుతున్నాయి అని. ఉదాహరణకి నేను గుడుంబా శంకర్ చూడడానికి ముందు యెందుకనొ తెలియదు నాకు పవన్ కల్యాణ్ పెద్దగా నచ్చే వాడు కాదు. ఖుషి తరువాత వచ్చిన చాలా సినిమాలని నేను ఛూడకుండానే మిస్స్ చెసాను. గుడుంబా శంకర్ with out ఎక్స్పెక్టేషన్ వెళ్లాను. సినిమా మొత్తం పవన్ కల్యాన్ పెర్ఫార్మన్స్ బాగా నచ్చింది. కాని బాలు కి ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లాను అందుకేనేమొ సినిమాని అంతగా ఎంజాయ్ చెయ్యలేక పొయ్యాను.సినిమా బాగున్నా ఇంకా ఇంకా వుంటే బాగున్ను అని అనుకున్నాను. కనుక డైరక్టర్లు ఈ విషయాలను కూడా దృష్టిలొ పెట్టుకొవాలి మరి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment