Friday, December 26, 2008

సమీక్షలా (రివ్యూ)? చదివితే అంతే !

బాబొయ్ సమీక్షలు ! ఇదెంటి అనుకుంటున్నరా ఇప్పుడే జొస్యుల సుర్యప్రకాష్ గారు రాసిన "చూస్తె అంతే" (నేనింతె సినిమా గురుంచి లేండి) నవతరంగం లొ చదివాను.చదివిన తరువాత ఇప్పుడు తల పట్టుకుంటున్నాను అస్సలు ఎందుకు చదివానా అని. రివ్యూ ల మీద నా మొత్తం అభిప్రాయాలను మార్చివేసారు. అయన తన పైత్యమంతా రివ్యూ పేరుతో ప్రయొగించారు. బ్లాగ్ ముఖంగ నేను చెసే విన్నపం ఏమిటంటె దయ చేసి సినిమా విషయంలొ ఎవరి మాటా నమ్మకండి. ఆంధ్రులు పొస్టెర్ చూసి స్టోరి చెప్పెసే రకాలు. మీ తెలివితేటలు మీరే తక్కువ చేసుకొకండి. పొస్టెర్లు చూడండి, ట్రైలర్లు చూడండి నచ్చితే సినిమాకి వెళ్ళండి లేకపొతే లేదు
p.s మీకు కూడా ఆ తలనొప్పి ఎందుకని లింక్ ఇవ్వడం లేదు.

3 comments:

Kathi Mahesh Kumar said...

సమీక్ష అంటే వీక్షించినదాన్ని మనకు జ్ఞానం,అనుభవంతో బేరీజు చేసి ఇతరులకు తెలియజెప్పడం.జోస్యులగారు అక్కడ(నవతరంగంలో) చేసినా మీరు ఇక్కడ చేసినా రెండూ ఒకటే, రెంటికీ సమానమైన విలువుంది.

నాగప్రసాద్ said...

మీకు "నేనింతే" సినిమా అంత బాగా నచ్చింటే, సినిమా "కేక", సూపర్ డూపర్ హిట్టు అని మీరే ఓ రివ్యూ రాయొచ్చు కదా. ఇతరులని అనడం ఎందుకు.
మీరు కూడా నవతరంగంలో రాయొచ్చు. అక్కడ ఒకే సినిమాకు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రివ్యూ రాయొచ్చు. వెంటనే వెళ్ళి సినిమా కేక అని ఒక రివ్యూ రాసేయండి.

ఒకటి గుర్తుంచుకోండి. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయంటే కారణం రివ్యూలే. సాధారణంగా కొత్త హీరోల సినిమాలకు వెళ్ళటానికి మనము అంతగా ఇంట్రెస్ట్ చూపించం. కాని రివ్యూల్లో వాటి గురించి మంచిగా రాసింది చదివి, నేను ఎన్నో సార్లు అలాంటి సినిమాలు చూశాను. వాళ్ళు రాసేది నిజం కూడా (నా దృష్టిలో).

రివ్యూలు చదివి సినిమా ఎంజాయ్ చెయ్యలేమంటే, దానికి పూరీ అంత తెలివితక్కువ వాడు ఎవ్వడూ లేడు ఈ ప్రపంచంలో.

ఎందుకంటే, నేను "గోదావరి" సినిమా రివ్యూ చదివి, సినిమా చాలా బాగుందంటే వెళ్ళి చూశా. నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది(మొత్తం కథంతా ముందే తెలిసినా కూడా). అంతే, ఒకే నెలలో పది సార్లు చూశా అదే సినిమాని. సినిమాలో దమ్ముండాలే గాని, ఎన్ని సార్లైనా చూడాలనిపిస్తుంది.

అంతేగాని, ఎంత సేపూ ఓ పదిమంది విలన్లని పెట్టి, హీరో వాళ్ళని కుళ్ళబొడిచినా కూడా, మళ్ళీ మళ్ళీ హీరోమీదకి పోయి క్లైమాక్స్ దాకా తన్నులు తింటూ, అరగంటకోసారి హీరోయిన్ రెండు గుడ్డముక్కలు చుట్టుకొచ్చి నడుము వూపి పోయే సినిమాలని ఎన్నిసార్లు చూడాలి. అందుకే రివ్యూల మీద ఆధారపడేది జనాలు.

నాకు ఆంధ్రపదేశ్ లో టికెట్ రేటు ఎంతో తెలియదు గాని, ఇక్కడ మాత్రం మినిమం 150 రూపాయలు. ఒక సినిమా చూడాలంటే 250 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే ఎవరైనా చూసొచ్చి సినిమా బాగుందంటేనే వెళ్తాం. బాగాలేని సినిమా కూడా చూడాలంటే, పూరి దగ్గర వున్నన్ని డబ్బులు అందరి దగ్గరా వుండాలి కదా.

మనలో మన మాట, మీరు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చూస్తారు.

raju said...

నాక్కూడా సమీక్ష లో చెప్పినంత దారుణంగా లేదనిపించింది