Saturday, December 27, 2008

సినిమా ఏ క్లాసు?

సందేహం సందేహం ఎమిటో ఈ మద్య నాకు దౌబ్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటి సందెహం ఎమిటంటె అసలు మంచి సినిమా ఏ క్లాసు ఎందుకంటే క్లాసు సినిమా మాసు సినిమా అని విభజన జరిగింది కదా. ఇలా ఎందుకంటున్నాంటే నేను సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులతోను చూసాను. వాళ్ళ కామెంట్స్ విన్నాను ప్రతీ సినిమాని రేండు సార్లు రెజర్వెడ్ లోను నేల లోను చూసాను. చాలా సార్లు మంచి సినిమాలను గొదావరి, ఐతె ,ఆనంద్ లాంటి సినిమాలు కింది వర్గం(క్షమించండి ఇక్కడ నేల టిక్కెట్ తీసుకున్న వాళ్ళనని నా వుద్దేసం కాదు పై నుంచి కిందకు స్క్రీన్ కు దగ్గరగా వుంటారు కాబట్టి అందుకని) ఎక్కువమంది ఎంజాయ్ చెయ్యలేక పొయారు ఎందుకని? అవే సినిమాలను పై వర్గం బాగానే రిసీవ్ చెసుకున్నారే నాకు కూడా నచ్చాయి.నిజానికి అవి మంచి సినిమాలేనే మరి ఎందుకు ఈ తేడా. కుటుంబ, సాంఘిక(అంటె పెరిగిన వాతావరణం ) తో బాటు విద్య కూడా ప్రభావితం చేస్తున్నదన్నమాట. బాబొయ్ సినిమా తొ అందరనీ మెప్పించడం చాలా కష్తమండి. సొల్యూషన్ అలొచించాలి మరి.

No comments: