Tuesday, March 10, 2009

హైదరాబాద్ లో చెత్త థియేటర్లు

అహా అహా ఏమని వర్ణించను ఆ బాధను. ఈ మద్య ఎర్రగడ్డ లో గల శశికల థియేటర్ కి వెళ్ళాను. బెస్ట్ రేటింగ్స్ ఇమ్మంటే 100 కి 2 ఇస్తానేమొ. జనం నుంచి డబ్బు ఎలా పిండుకొవాలొ మాత్రం బాగా తెలుసు సదరు థియేటర్ వాళ్ళకి. ఒక్క సౌకర్యం కూడ లేదు. గొప్ప విఛిత్రం ఎమిటంటే A/c థియేటర్ అయ్యి వుండి బయట ఎంత చల్లగా వుందంటే సినిమా మాట దేవుడెరుగు ముందు గాలి కొసం బయటపడే అంత. ఇంక కాంటీన్ లొ రేట్ల గురుంచి అడగక్కర్లేదు కూల్ డ్రింక్ 18.00 రూపాయలు .తిను బండరల గురుంచి మాత్రం అస్సలు అడగకండి వాటి గురుంచి చెప్పకపొవడమే మంచిది. ఇంక టాయిలెట్స్ విషయానికి వస్తే కలరా వుండలు వేసి ఎన్నాళ్ళు అయ్యి వుంటుందో. టికెట్ రేట్ మాత్రం 50 వుండనే వుంది. అదే రేట్ లొ TalkieTown కి దీనికి అస్సలు పొలికా. కాని ఒక్కటండి ఇలాంటి థియేటర్ యాజమాన్యాని ఏమీ చెయ్యలేమా?
P.S సినిమా మొత్తం చూడకుండానే బయటకు వచ్చేసాము. మరి ఎమి చెయ్య మంటారు సినిమా మొదలయ్యి 1.30 గంటలలొ మూడు బ్రేక్లు ఇచ్చాడు మరి !

2 comments:

నాగప్రసాద్ said...

హైదరాబాదులో థియేటర్స్ చాలా వరకు బాగుంటాయి. ఈ ఎర్రగడ్డలోని కళ కాంప్లెక్స్ అంత బాగుండదు. అమీర్ పేట నుండి కూకట్ పల్లి వరకు థియేటర్స్ అంత బాగుండవు. అటువైపు దిల్ షుక్ నగర్, RTC Cross Roads వైపు థియేటర్స్ బాగుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో టికెట్ రేటేంతో నాకు తెలియదు కాని, నేనున్నప్పుడు Maximum 35 రూపాయలుండేది.

Jahnavi said...

Hyd lo theatres kottalo bagane untayi .taruvata maitainance assalu baagodu.konni saarlu seatcovers valla skin irritate ayi allergy vastundi.cinma choodataniki vache janam kooda ekkada padite akkada ummi vestaru,chetta vestaru. Ee vishayam lo itu janam atu theatre staff sahakariste tappa conditions improve kaavu.